సూర్య, కార్తి, విక్రమ్ లా తెలుగులో తనదంటూ ఓ మార్కెట్ సంపాదించుకోవడానికి విజయ్ కి చాలా కాలం పట్టింది. తుపాకీతో ఓకే అనిపించుకున్నాడు. అప్పటి నుంచీ విజయ్ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లనే అందుకుంటున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చిన మాస్టర్ కూడా ఓకే అనిపించింది. ఇప్పుడు తెలుగులో నేరుగా ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాకి గానూ... విజయ్ ఏకంగా 90 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. తమిళంలో విజయ్ పారితోషికం 80 కోట్లే. అంటే ఓ పది కోట్లు ఎక్కువ పలికాడన్నమాట. తెలుగు సూపర్ స్టార్స్ మహేష్, పవన్ లకే ఈ స్థాయి పారితోషికం లేదు. ఒక్క ప్రభాస్‌కే అంత పారితోషికం ఇస్తున్నారు. తొలి సినిమాకే.. విజయ్ ఇంత పారితోషికం తీసుకుంటున్నాడంటే గ్రేటే. పొరిగింటి పుల్లకూర రుచెక్కువ అంటే ఇదేనేమో...?